తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు గురువారం ఆత్మకూరు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసి బస్టాండ్ నుంచి ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాల వరకు ర్యాలీ గా వెళ్లి నివాళులు అర్పించి, రాష్ట్ర ప్రభుత్వ చీకటి జీవో ప్రతులను దహనం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు.