మైలవరం నుంచి పెన్నా నదికి 3వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు బుధవారం జలాశయ ఏఈఈ గౌతమ్ రెడ్డి తెలిపారు. గండికోట నుంచి మైలవరానికి మూడు వేల క్యూసెక్కుల మేర నీరు వచ్చి చేరుతుండంతో పెన్నా నదికి, ఉత్తర కాలువకు 100 క్యూసెక్కులు , దక్షిణ కాలువకు 200 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మైలవరం పూర్తి సామర్థ్యం 6, 500 టిఎంసిల కాగా ప్రస్తుతం 6, 300 టిఎంసిల నీరు నిలువ ఉంది.