కుప్పంలో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీలను ప్రభుత్వం అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని కడప జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు పుత్తా ఎల్లారెడ్డి అని అన్నారు. బుధవారం కమలాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు పుత్తా ఎల్లారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రం ఏమైనా నీ జాగీరా జగన్ రెడ్డి! ఏపీలో ఏమైనా ఎమర్జెన్సీ విధించావా? కుప్పంపై ఏకంగా అప్రకటిత యుద్ధమే ప్రకటించారు అని అన్నారు.
వైసీపీ, పోలీసులు బ్రిటీష్ చట్టానికి బూజు దులిపి అర్ధరాత్రి జీవో ఇస్తావు, తెల్లారేసరికి ఉల్లంఘిస్తావు, చట్టం మీ ఎదుగూరి సంధింటికి ఎదురింటి చుట్టమా? ప్రతిపక్షనేత చంద్రబాబు తన నియోజకవర్గంలో పర్యటించేందుకు నీ ఆంక్షలేంటి? నీ కుతంత్రాలన్నీ కుప్పంలో ప్రయోగిస్తున్నావు అని అన్నారు. చంద్రబాబు ప్రచారరథం స్వాధీనం చేసుకున్నావు, కార్యకర్తల్ని కొట్టిస్తున్నావు, నాయకుల్ని నిర్బంధించావు, ఎన్ని అరాచకాలకు పాల్పడినా నీపై ప్రజావ్యతిరేకత తగ్గదు అని అన్నారు.
చంద్రబాబుకు జనాదరణ ఇంకా పెరుగుతూనే ఉంటుంది, 35 ఏళ్లుగా కుప్పం నీలాంటి కుట్రదారులని ఎంతోమందిని చూసింది, తెలుగుదేశం కోట కుప్పంలో నీ కుప్పిగెంతులు చెల్లవు, పసుపుసైన్యం కదం తొక్కుతోంది, నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు కుప్పం పర్యటన ఆపలేవు అని అన్నారు. సమావేశంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.