సరిహద్దు, గిరిజన ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 8 లక్షల కుటుంబాలకు డీడీ ఉచిత సెట్ టాప్ బాక్సులను ప్రభుత్వం అందించనుంది. దీని కోసం రూ.2,539 కోట్లను.. సమాచారం, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. బ్రాడ్ కాస్టింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్ వర్క్ డెవలప్ మెంట్ పథకం ద్వారా వారికి అందివ్వనుంది. దీంతో దేశంలో ప్రసార భారతి, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ కార్యక్రమాలు మరింత చేరువ కానున్నాయి.