ఆంధ్రప్రదేశ్ వైకాపా ఎమ్మెల్యే మాజీ హోమ్ మినిస్టర్ సుచరిత, ఆమె భర్త పార్టీ మారబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై సుచరిత గురువారం ఓ క్లారిటీ ఇచ్చారు. ఈనేపథ్యంలో ఆమె రాజకీయంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తమ మనుగడ వైసీపీతోనేనని పేర్కొన్నారు. తాను ఒక స్టేట్మెంట్ ఇచ్చానంటే తన భర్త దయాసాగర్ కూడా దానికి కట్టుబడే ఉంటారని తెలిపారు. అలా కాకుండా నా భర్త దయాసాగర్ పార్టీ మారతాను నువ్వు నాతో రా అంటే ఎంత రాజకీయ నాయకురాలినైనా భర్తతో పాటు వెళ్ళాల్సిందేగా అని పేర్కొన్నారు. తన భర్త ఒక పార్టీలో. నేను మరొక పార్టీలో మా పిల్లలు వేరొక పార్టీలో ఉండరని. ఉంటే అంతా ఒక్క పార్టీలోనే ఉంటామన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. గుంటూరు జిల్లా కాకుమానూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఇలా తన రాజకీయ జీవితం పై మాట్లాడారు.