కిచెన్ గార్డెన్‌లో ఉద్యోగం పేరిట తనను శ్రీకాకుళం జిల్లా, పొందూరుకు చెందిన లక్ష్మి, గవర్రాజు మోసం చేశారని అదే పంచాయతీ పరిధిలోని లక్ష్మీపేటకు చెందిన కోవెల నాగరాజు బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కిచెన్ గార్డెన్‌లో మండల కో-ఆర్డినేటర్ ఉద్యోగానికి తన నుంచి రూ.2 లక్షలు తీసుకుని తప్పుడు నియామకపత్రం ఇచ్చారని, అసలు ఆ ఉద్యోగాలే లేవని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనకు న్యాయం చేయాలని కోరాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa