ప్రస్తుత కాలంలో చాలామందిని వేదిస్తున్న సమస్య నిద్రలేమి. నిద్రలేకపోతే ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. పనుల్లో ఏకాగ్రత కోల్పోతారు. అయితే ఎవరు ఏ సమయానికి ఎంత నిద్రపోవాలో తెలుసా. 5 ఏళ్ల లోపు చిన్నారులు 10-13 గంటల పాటు నిద్రపోవాలి. 14-17 ఏళ్ల వాళ్లు రోజుకు 8 నుంచి 10 గంటల పాటు నిద్రపోవాలి. 18-64 ఏళ్ల వారికి రోజుకు 7- 9 గంటల పాటు నిద్ర అవసరం. ఇక 65 అంతకంటే ఎక్కువ వయసు వారు రోజుకు 7-9 గంటల పాటు నిద్రపోవాలి.