టీడీపీ సభలను అడ్డుకోవడానికే ప్రభుత్వం నల్ల జీవోను తీసుకొచ్చిందని ఆ పార్టీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎరిక్షన్‌బాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబరు1ని విడుదల చేసి కుప్పంలో చంద్రబాబునాయుడి పాదయాత్రలను పోలీసులు నిలిపివేయడాన్ని నిరసిస్తూ గురువారం ఎర్రగొండపాలెంలో టీడీపీ నాయకులు జీవో ప్రతులను అంబేడ్కర్ విగ్రహం చేతిలో ఉంచి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ.. ఎపుడో కాలం చెల్లిన జీవో నంబరు 1కు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోరలు తొడిగింద న్నారు. ప్రజలు తిరగబడి ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ది చెప్పుతారన్నారు. అనంతరం జీవో ప్రతులను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు చేకూరి సుబ్బారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ కరిముల్లా, టీడీపీ మాజీ అధ్యక్షుడు కామేపల్లి వెంకటేశ్వర్లు, శనగా నారాయణరెడ్డి, కాకర్ల కోటయ్య, టీడీపీ నాయకులు తోట మహేష్, కంచర్ల సత్యనారాయణగౌడ్, షేక్ ఇస్మాయిల్ , షేక్ మాబు, షేక్ మస్తాన్ వలి, కోటా డేవిడ్, పి యెంగయ్య, కొత్త బాస్కర్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
![]() |
![]() |