తెలుగుదేశం ప్రభుత్వం హాయంలో చంద్రబాబునాయుడు తలుచుకుంటే జగన్ పాదయత్ర జరిగేదా అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రశ్నించారు. గురువారం ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ వాళ్ల రోడ్డుషోలకు వర్తించని జీవోలు తెలుగు దేశం పార్టీ కార్యక్రమాలకు వర్తిస్తాయా అని మండిపడ్డారు. వైసీపీ పాలనపై విసుగుచెందిన ప్రజలు చంద్రబాబు సభలకు తరలివస్తుంటే పాలకులు ఓర్వలేకపోతున్నారని చెప్పారు. టీడీపీ సభలు విజయవంతం కాకుండా తోపులాటలు, తొక్కిసలాటలు చేయించి, తప్పుడు సంకేతాలు తీసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. కందుకూరు, గుంటూరులోజరిగిన చంద్రబాబు సభల్లో జరిగిన ఘటనలకు పోలీసుల వైఫల్యమే కారణమని ఆరో పించారు. ప్రజలు లక్షలాదిగా తరలి వస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీ సులు నిర్లక్ష్యంగా వ్యవ హరించారన్నారు. రోడ్డుషోలను అడ్డుకునేందుకు ప్రభుత్వం 1861 యాక్ట్ ద్వారా జీ వో విడుదల చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబా బుకు లభిస్తున్న ప్రజాదరణ చూసి తాడేపల్లిలో జగన్ పీఠం కదులుతుందన్నారు. ఈనెల 26న జ రిగే లోకేష్‌బాబు యువ గళం పాదయాత్రను ఎ వరూ ఆపలేరన్నారు. 400రోజులు, 4వేల కిలోమీ టర్లు లోకేష్‌బాబు పాదయాత్ర జరుగుతుంద న్నారు. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని ఒంగోలు ఏబీఎం కాలేజీగ్రౌండ్‌లో నిర్వహించాలని ఏర్పాట్లు చేసుకుంటే రక్షణ కల్పించలేమని పోలీసులు చెప్పి అనుమతులు ఇవ్వకపోవడం దారుణమన్నారు.