సింగనమల మండలం తరిమెల గ్రామానికి చెందిన సీనియర్ టిడిపి కార్యకర్త నాగముని కుటుంబాన్ని శుక్రవారం గుమ్మేపల్లి సర్పంచ్ డేగల లలితమ్మ, డేగల కృష్ణమూర్తి దంపతులు పరామర్శించారు. గత పది రోజుల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న వారు తరిమెలలోని ఆయన ఇంటి దగ్గరకు వెళ్ళి పరామర్శించారు. టిడిపి అండగా ఉంటుందని ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని భరోసాను కల్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు దండు విజయ్ కుమార్ , తరిమెల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.