ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలికకు టీచర్ లవ్‌లెటర్

national |  Suryaa Desk  | Published : Fri, Jan 06, 2023, 07:42 PM

ఉత్తరప్రదేశ్‌ కన్నౌజ్‌లోని ఓ ప్రాథమిక పాఠశాలలో బాలికకు లవ్‌లెటర్ రాశాడు ఓ ఉపాధ్యాయుడు. 'నేను నిన్ను ప్రేమిస్తున్నాను, సెలవుల్లో బాగా మిస్‌ అవుతున్నా. స్కూల్‌కి ముందే రా, మనిద్దరం పక్కపక్కనే కూర్చొని ఒకరినొకరం అర్థం చేసుకోవచ్చు' అని లేఖలో రాశాడు. ఈ విషయాన్ని విద్యార్థిని కుటుంబసభ్యులకు తెలియజేయడంతో వారు గొడవకు దిగారు. బాలిక తండ్రి ఫిర్యాదు చేయటంతో పరారిలో ఉన్న టీచర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com