ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మృతి చెందాడు. సేకరించిన వివరాల ప్రకారం మచిలీపట్నం నుంచి ఏలూరు పాత బస్టాండ్ కు శుక్రవారం బస్ బయలు దేరి వెళ్లింది. తిరిగి వస్తుండగా 50 ఏళ్లు పైబడిన వ్యక్తి బస్సు ఎక్కి గుడ్లవల్లేరుకు టిక్కెట్ తీసు కున్నాడు. నాగవరప్పాడు దాటిన తర్వాత ఆ వ్యక్తి బస్సు సీటులోనే మూత్ర విసర్జన చేయడం సహచర ప్రయాణి కులు గమనించి మాట్లాడే ప్రయత్నం చేశారు. అతను స్పందించక పోవడంతో డ్రైవర్ కు సమాచారం ఇచ్చారు. అప్పటికే గుడివాడ స్టాండ్ కు బస్సు చేరింది. డ్రైవర్ వచ్చి చూడగా సీటులోనే ప్రయాణికుడు కుప్పకూలి ఉన్నాడు. వెంటనే గుడివాడ అసిస్టెంట్ డీఎం జె. ఎస్. నారాయణకు సమాచారం ఇవ్వగా ఆయన సూచన మేరకు 108కు ఫోన్ చేశారు. వారొచ్చి అతను మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అతని జేబులో ఉన్న ఫోన్ నెంబరుకు ఫోన్ చేయగా కుటుంబ సభ్యులు అతడిని అంబులెన్స్ లో గుడ్ల వల్లేరు తీసుకెళ్లారు. పేరు వివరాలు తెలియరాలేదు.