బైక్ పై వెళ్లేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ఆ సమాచారాన్ని లోకేషన్ సహా కుటుంబ సభ్యులకు చేర వేసేలా రిధిమా ఠాకుర్ అనే పదో తరగతి విద్యార్థిని స్మార్ట్ హెల్మెట్ రూపొందించింది. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఈమె ఈ హెల్మెట్ ను రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రదర్శనకు ఉంచింది. హెల్మెట్ మర్చిపోయినా, ధరించకపోయినా బీప్ అనే శబ్దం వస్తుంది. ఇందులో లొకేషన్ ట్రాకర్, ట్రాన్స్ మీటర్ వంటి ఫీచర్లూ ఉన్నాయి.