కోట్లాది రూపాయల టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి పశ్చిమ బెంగాల్ మాజీ విద్యాశాఖ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ సెక్రటరీ జనరల్ పార్థ ఛటర్జీ జ్యుడీషియల్ కస్టడీని కోల్‌కతాలోని ప్రత్యేక ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పిఎంఎల్‌ఎ) కోర్టు శనివారం ఫిబ్రవరి 7 వరకు పొడిగించింది. ఛటర్జీ తరపు న్యాయవాది సుకన్య భట్టాచార్య తన క్లయింట్‌కు తగిన వైద్య సహాయం అందడం లేదని, ఈ లెక్కన తగిన ఏర్పాట్లు చేయాలని కోర్టును కోరారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఛటర్జీ స్వయంగా కోర్టుకు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa