ప్రతిరోజూ కాసేపు వ్యాయామం చేయాలని వైద్యులు చెబుతుంటారు. అయితే ఉరుకులు పరుగుల జీవితంలో తమకు టైమ్ దొరకడం లేదని చాలా మంది అంటుంటారు. కానీ రోజులో కనీసం 10వేల అడుగులు నడిస్తే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంగల నిడివి, నడిచే వేగాన్ని బట్టి అడుగులు, సమయం అటూఇటూ అవ్వచ్చు. ఏదేమైనా నడవటం ముఖ్యం. కేవలం ఉదయం పూటే నడవాలనేమీ లేదు. రోజులో ఎప్పుడైనా నడవండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి.