కందుకూరు, గుంటూరుల్లో జరిగిన తొక్కిసలాట సంఘటనలపై ప్రభుత్వం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.శేషశయనరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక విచారణ కమిషన్‌ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శనివారం సాయం త్రం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది డిసెంబరు 28న కందుకూరులో, ఈ నెల 1న గుంటూరులో జరిగిన తొక్కిసలాటకు కారణాలను, బాధ్యులను గుర్తించాలని సూచించింది. కమిషన్ బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa