ఏపీలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు. పలాసలో మార్చి నాటికి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అలాగే, ప్రతి జిల్లాలో క్యాథ్ ల్యాబ్, గిరిజన ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామని తెలిపారు.