సాధారణంగా దాహమేసినప్పుడు, అన్నం తిన్నప్పుడు తాగుతుంటాం. అయితే కొందరు మరీ ఎక్కువగా నీరు తాగుతుంటారు. ఒంట్లో ఎక్కువగా నీరు చేరడం వల్ల అన్ని అవయవాల్లోని కణాల్లో నీటి శాతం ఎక్కువవుతుంది. తద్వారా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. తల తిరగడం, తలనొప్పి, అయోమయం, రక్తపోటు పెరుగుతుంది. గుండె లయ తప్పుతుంది. కిడ్నీలపై భారం పెరిగి మూత్రపిండాల వైఫల్యానికి దారి తీస్తుంది. కాబట్టి మోతాదులోనే నీరు తాగాలి.