నీళ్లను రాజకీయాలతో ముడిపెట్టకుండా మెట్టప్రాం త ప్రజలకు అందించాలని, సోమశిల హైలెవెల్ కెనాల్ పనులు ప్రభుత్వం చిత్త శుద్ధితో చేస్తే మూడేళ్లలో పూర్తి చేయవచ్చని, కాళేశ్వరంతో పోల్చితే ఇది పెద్ద సమస్య కాదని, సత్వరమే రూ.వెయ్యి కోట్లు నిధులు మంజూరు చేసి, ఈ ఏడాది లో సగం పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండల కేంద్రమైన బస్టాండ్ సెంటర్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన అఖి లపక్ష సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడుతూ.... ఏడాదిలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, ఇప్పుడే రాజకీయాలకు అతీతంగా ప్రజలు ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేయాలని సూచించారు. కెనాల్ పనులకు శంకు స్థాపన చేసి పదేళ్లు పూర్తయి.. మూడు ప్రభుత్వాలు మారాయన్నారు. కాగా ఇదే సమయంలో డెల్టా ఏరియాలో సంగం, నెల్లూరు ఆనకట్టలు ప్రారంభించి పూర్త య్యాయి. ఈ ప్రాంత ప్రజలు ప్రశ్నించకుంటే ఇంకో పదేళ్లకు కూడా సోమశిల హైలెవల్ కెనాల్ పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదన్నారు. కార్యక్ర మంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, రైతు సంఘం జిల్లా నాయ కుడు చండ్రా రాజగోపాల్, వ్యవసాయ సంఘం జిల్లా కార్యదర్శి వెంగయ్య, వైసీపీ మండల కన్వీనర్ బొర్రా సబ్బిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.