గతంలో అమరావతి నిర్మాణానికి కాలపరిమితిపై హైకోర్టు తీర్పు వెలువరించగా, సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.ఈ నేపథ్యంలో అమరావతిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో రాజధాని రైతులను, వివిధ రాజకీయ పార్టీలను ప్రతివాదులుగా పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది. 161 మంది ప్రతివాదులు జనవరి 31లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.