ఈనెల 11వ తేదీ బుధవారం కమలాపురం పట్టణంలోని సచివాలయం - 2 పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం నుంచి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేడు మధ్యాహ్నం 1: 30 గంటలకు స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, చింతకొమ్మదిన్నె జడ్పిటీసీ పి. నరేన్ రామాంజుల రెడ్డిలు పాల్గొని ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ ఫలాలు, ప్రజల సమస్యలు తెలుసుకుంటారు అని అన్నారు. అధికారులు, సచివాలయ సిబ్బంది హాజరు కావాలన్నారు.