పేదల అభ్యున్నతే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం అని నందిగామ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పేర్కొన్నారు. కంచికచర్ల పట్టణంలోని 2 సిగ్మెంట్ పరిధిలో బొడ్రాయి సెంటర్ వద్ద నుండి బుధవారం గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ప్రతి గడపకు వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించడంతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు -లబ్ధిదారులకు అందుతున్న తీరు గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల అభ్యున్నతే లక్ష్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 98శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలకు కట్టుబడి సీఎం పరిపాలన చేస్తున్నారని అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, సంక్షేమ లబ్ధితో పేదవర్గాలు ఆర్థికంగా అభ్యున్నతి చెందుతున్నారని తెలిపారు. ప్రతి సచివాలయ పరిధిలో సమస్యల పరిష్కారానికి రూ. 20 లక్షలు కేటాయించినట్లు పేర్కొన్నారు, గత చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలు చెప్పిన వారికే పథకాలు అందేవని, నేడు అర్హత ఉంటే పథకాలు ఇంటి ముంగిటకే అందుతున్నాయని చెప్పారు, నిరంతరం ప్రజల కోసం పరితపిస్తున్న సీఎం జగనన్నకు మళ్ళీ అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేల్పుల సునీత శ్రీనివాసరావు, ఉపసర్పంచ్ వేమ సురేష్ బాబు, ఎంపీపీ మలక్ బషీర్, జడ్పిటిసి వేల్పుల ప్రశాంతి, నాయకులు కాలవ పెదబాబు, ఈవో రవికుమార్, మాడుగుల శంకర్, నారిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.