ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తున్న వారికి కబీరా మొబిలిట కంపెనీ శుభవార్త చెప్పింది. తక్కువ ధరకే అదిరిపోయే స్కూటర్ కొలిజియో నియోను మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు వివరించింది. ఒక్కసారి చార్జింగ్ పెడితే వంద కిలోమీటర్లు మైలేజీ ఇస్తుందని ప్రకటించింది. వినూత్నమైన డిజైన్ తో తేలికగా ఉండే ఈ స్కూటర్ చూడముచ్చటగా ఉంటుందని చెబుతోంది. ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధరను రూ.45,990 గా నిర్ణయించినట్లు పేర్కొంది. ఇక దీని ఆన్ రోడ్ ప్రైస్ రూ.49,200 అని వెల్లడించింది. ఇంకా ఈ స్కూటర్ లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, డిజిటల్ ట్రిప్ మీటర్, డిజిటల్ స్పీడో మీటర్, జియో ఫెన్సింగ్, యాంటీ థెఫ్ట్ అలారం,
లైవ్ ట్రాకింగ్, ఇంటెలిజెంట్ యాంటీ థెఫ్ట్ అండ్ ఎస్ఓఎస్, ట్రిప్ హిస్టరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
కొలిజియో స్కూటర్ ప్రత్యేకతలు..
48 వీ 24 ఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ (ఏడాది వారంటీతో)
250 వాట్ పవర్ సామర్థ్యంతో బీఎల్ డీసీ ఎలక్ట్రిక్ మోటార్
కేవలం 4 గంటలలో బ్యాటరీ ఫుల్ చార్జింగ్.. ఆపై వంద కిలోమీటర్ల వరకు పరుగు
టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు
ముందు భాగంలో డిస్క్ బ్రేక్.. వెనక డ్రమ్ బ్రేక్, స్ప్రింగ్ టైప్ సస్పెన్షన్ సిస్టమ్
రిమోట్ స్టార్ట్, పుష్ బటన్ స్టార్ట్ సౌకర్యం
స్కూటీలో ఇన్ బిల్ట్ గా మొబైల్ యాప్
ఎల్ఈడీ హెడ్ లైట్స్, టెయిల్ లైట్స్, టర్న్ సిగ్నల్ ల్యాంప్, లో బ్యాటరీ ఇండికేటర్