నేడు జనసేన ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తాళ్లవలసలో 'యువశక్తి' సభ నిర్వహించనున్నారు. ఈ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం కోసం 30 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు సభ జరగనుండగా, మధ్యాహ్నం పవన్ సభా వేదిక వద్దకు రానున్నారు. యువతతో మాట్లాడాక ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సభకు 1.50 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు.