వ్యాపార వీసాల జారీని వేగవంతం చేయాలని భారత్.. అమెరికాను అభ్యర్థించింది. తద్వారా ప్రజలు తమ వ్యాపార, వాణిజ్య ప్రయోజనాలను కొనసాగించేందుకు ప్రయాణాలను చేపట్టవచ్చని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బుధవారం తెలిపారు. ఇరు దేశాల మధ్య నిపుణులు, విద్యార్థులు, పెట్టుబడి దారులు, వ్యాపార యాత్రికుల ప్రయాణాలు పెరిగిపోతున్నాయని గోయల్ చెప్పారు.