ఏపీలో మరో రూ. 2 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు కార్ల తయారీ సంస్థ కియా ఇండియా ప్రకటించింది. అనంతపురం ప్లాంట్ లో ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల పరిశోధన, అభివృద్ధి, తయారీ, మౌలిక వసతులకు ఈ మొత్తాన్ని వెచ్చించనున్నట్లు సమాచారం. కాగా, దేశీయంగా తయారైన ఎలక్ట్రిక్ కియా కారును 2025లో ఆవిష్కరించాలనే లక్ష్యంతో కియా ఇండియా పనిచేస్తోంది.