గుంతకల్లు పట్టణంలోని 35వ వార్డు పోర్టర్ లైన్ ఏరియాలో సాధారణ నిధులతో ఏర్పాటు చేసిన మట్టి రోడ్డు పనులను గురువారం మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న క్షేత్ర స్థాయిలో వెళ్లి పరిశీలించారు. అభివృద్ధి నిర్మాణ పనులలో నాణ్యత ఉండేలా పర్యవేక్షణ చేయాలని ఎఇ షబానాను ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రతలో ప్రజలను కూడా భాగ స్వామ్యం చేయాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. చెత్త సేకరణ యూజర్ చెర్జీలను ప్రజలు స్వచ్ఛం దంగా చెల్లించేలా క్లాప్ కార్యక్రమంపై అవగాహన కల్పించాలని సూచిం చారు. ఆయనతో పాటు ఆ వార్డు కౌన్సిలర్ షరీఫ్ ఉన్నారు.