విజయవాడ డివిజన్‌లో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా ఈనెల 12న పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. 12న విజయవాడ-బిట్రగుంట (07978), 12, 13న బిట్రగుంట- చెన్నై సెంట్రల్ (17237) చెన్నై సెంట్రల్-బిట్రగుంట (17238), 13, 14న బిట్రగుంట-విజయవాడ (07977), 12న విజయవాడ-గూడూరు (07500), 12, 13న గూడూరు-విజయవాడ (07458), జనవరి12న కాకినాడ పోర్టు-విశాఖపట్నం (17267), విశాఖపట్నం-కాకినాడ పోర్టు (17268), విజయవాడ-ఒంగోలు (07461), ఒంగోలు- విజయవాడ (07576) రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. 12న విజయవాడ- భద్రాచలంరోడ్ ప్యాసింజర్‌రైలు (07079), భద్రాచలం రోడ్-విజయవాడ ప్యాసింజర్ (07278), సికింద్రాబాద్-వరంగల్ ప్యాసింజర్ (07462), వరంగల్- హైదరాబాద్ ప్యాసింజర్ (07463) రైళ్లను కూడా రద్దు చేసినట్టు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa