ప్రస్తుతం యావత్ ప్రపంచం సంక్షోభంలో ఉందని.. ఈ అస్థిరత ఎంత కాలం ఉంటుందో చెప్పడం కష్టమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గ్లోబల్ సౌత్ వర్చువల్ సమ్మిట్ లో గురువారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ సమాజాన్ని పట్టి పీడిస్తున్న పలు సమస్యలు లేవనెత్తారు. ఆహారం, ఇంధనం, ఎరువుల ధరల పెరుగుదల, ఆర్థిక రంగంపై కరోనా ప్రభావం, ప్రకృతి వైపరీత్యాలపై ఆందోళన వ్యక్తం చేశారు.