నారింజ పండ్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నారింజలో పొటాషియం, క్యాల్షియం, ప్రొటీన్లు, పీచు, విటమిన్లు ఉంటాయి. వీటిలో సి-విటమిన్ మెండుగా ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంచి వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. గర్భిణీ, బాలింత, నవజాత శిశువులకు అవసరమైన బి-9 విటమిన్ నారింజలో లభిస్తుంది. నారింజ రసం తాగితే కంటిచూపు మెరుగుపడుతుంది. నారింజ పండ్లు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. వీటిలోని పీచు జీర్ణప్రక్రియకు దోహదం చేస్తుంది. నారింజలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గాయాలను త్వరగా మాన్పుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంతో పాటు గుండెజబ్బులు, ఆర్థరైటిస్‌లను నియంత్రిస్తాయి.