గుజరాత్ కు చెందిన ఓ వ్యాపారికి మోర్బికి చెందిన రియా శర్మ నుండి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆమె ఓ వీడియో కాల్ చేసి అతని నగ్న దృశ్యాలు రికార్డు చేసింది. ఈ వీడియోను బయట పెట్టకుండా ఉండాలంటే 50 వేలు ఇవ్వాలని బెదిరించగా, అతను చెల్లించాడు. కొద్ది రోజులకే మరో వ్యక్తి పోలీసునని ఫోన్ చేసి 3 లక్షలు వసూలు చేశాడు. పలు దఫాలుగా అతని దగ్గరి నుండి మొత్తం రూ.2.69 కోట్లు కాజేశారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.