ప్రపంచ దేశాల్ల కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా సూచనలు చేసింది. ఎక్కువ దూరం, ఎక్కువ గంటలు విమానాల్లో ప్రయాణాలు చేసే వాళ్లు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని WHO సూచించింది. అన్ని దేశాలూ ప్రయాణికుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ముందుగానే కోవిడ్ టెస్టులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇక ప్రస్తుత నివేదిక ప్రకారం ఎక్స్‌బీబీ.1.5 వేరియెంట్ వేగంగా వ్యాపిస్తోంది.