ఎస్వీ యూనివర్సిటీ రెక్టర్ పదవిని దళితులకు కేటాయించాలని వైయస్సార్సీపి విద్యార్థి విభాగం యూనివర్సిటీ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. గురువారం ఎస్వీ యూనివర్సిటీ విసి రాజారెడ్డి, పాలకమండలి సభ్యులు కు విద్యార్థులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ రెక్టార్ పదవిలో ఉన్న శ్రీకాంత్ రెడ్డి ఇటీవల పదవి విరమణ చేశారన్నారు. ఖాళీ అయినా రెక్టర్ పదవిని దళితులకు కేటాయించి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కలలు కన్నా సామాజిక న్యాయాన్ని బలపరచాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై. యస్. జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు దళితులకోసమే పరితప్పిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం చేయాలని అధికారులకు సూచనలు చేశారని తెలిపారు. ఇదే క్రమంలో విశ్వవిద్యాలయాల్లో కూడా సామాజిక న్యాయం పాటించాలని ఉపకులపతులకు చూపించారన్నారు. కానీ ముఖ్యమంత్రి జగన్ ఆశించిన విధంగా కాకుండా, గతంలో ఎస్ యూనివర్సిటీలో దళితులకు అన్యాయం చేస్తూ రెక్టాక్ పదవిని అగ్రవర్ణాలకు కేటాయించారన్నారు. ఆ సమయంలో వై. యస్. ఆర్ విద్యార్థి విభాగం తరపున ఆందోళనలు చేపడితే ఆ రోజు ఉపకులపతి తదిపరి అవకాశం దళితులకు ఇస్తాం అని హామీ ఇచ్చారని తెలిపారు. ఆ హామీ మేరకు ఇప్పుడు ఖాళీ అయిన రెక్టర్ పదవిని దళితులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. రెక్టర్ పదవి ఖాళీమై సుమారు 12 రోజులు అవుతున్నా ఇప్పటికీ ఆ పదవిని భర్తీ చేయకపోవడంలో అంతర్యం ఏమిటో తెలియజేయాల్సిన బాధ్యత కూడా అధికారులపై వుందిన్నారు. అధికారులు వెంటనే స్పందించి రెక్టార్ పదవిని దళితులకు కేటాయించే విధంగా నిర్ణయం తీసుకుని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశయాలను నిలబెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు నరేష్ , ముని, హేమ్చంద్ , అక్బర్, చరణ్, గౌతమ్, చందు, పవన్, మోహన్, రాకేష్, పవన్, పాల్గొన్నారు.