కులాలవారీగా విడిపోతున్న తెలుగువారు ఎక్కడ ఉన్నా...ఒక జాతిగా ముందుకు రావాలని ప్రజా గాయకుడు గద్దర్ పిలుపునిచ్చారు. విశాఖపట్నంలోని వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ.. తెలుగుజాతిని ఐక్యం చేసేందుకు సాంస్కృతిక తెలుగు సేన కృషిచేస్తోందన్నారు. ఇందుకోసం తెలుగుసేన అధ్యక్షుడు సత్యారెడ్డి ఆధ్వర్యంలో ఫిబ్రవరి పదో తేదీన హైదరాబాద్ నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తామన్నారు. దేశంలోని పది రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభలు, బస్సు యాత్రలు, రోడ్‌షోలు నిర్వహిస్తామన్నారు.