భారత మార్కెట్ లోకి వివిధ కంపెనీల స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ లు అందుబాటులోకి వస్తున్నాయ. తాజాాగా లెనోవో కంపెనీ 5జీ సపోర్ట్ చేసే టాబ్లెట్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. కంపెనీ నుంచి వచ్చిన తొలి 5జీ టాబ్లెట్ ఇది. లెనోవో టాబ్ పీ11 5జీ పేరుతో వచ్చిన ఇందులో స్నాప్ డ్రాగన్ 750జీ చిప్ సెట్ ఉంటుంది. లెనోవో నుంచి ఇప్పటికే లెనోవో టాబ్ పీ11 ప్లస్, పీ11 ప్రో పేరుతో టాబ్లెట్లు మార్కెట్లో ఉన్నాయి. కానీ, ఇవి 4జీ సపోర్టెడ్ టాబ్లెట్లు. దీంతో పీ11 5జీ పేరుతో టాబ్ ను లెనోవో తీసుకొచ్చింది.
రెండు స్టోరేజీ వేరియంట్లలో ఇది లభిస్తుంది. 128జీబీ స్టోరేజీ టాబ్లెట్ ధర రూ.29,999. 256జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.34,999. అమెజాన్ ఇండియా, లెనోవో స్టోర్ నుంచి ఈ టాబ్లెట్ ను కొనుగోలు చేసుకోవచ్చు. ఇప్పటికే షావోమీ, రియల్ మీ కంపెనీలు 5జీకి సపోర్ట్ చేసే టాబ్లెట్లను తీసుకొచ్చాయి. షావోమీ ప్యాడ్ 5 128జీబీ ధర రూ.26,999. రియల్ మీ ప్యాడ్ ఎక్స్ 64జీబీ వేరియంట్ ధర రూ.25,999. వీటితో పోలిస్తే లెనోవో టాబ్ రూ.4వేలు అధికం.
ఇందులో 11 అంగుళాల 2కే స్క్రీన్ ఉంటుంది. డాల్బీ విజన్ కంటెంట్ కు సపోర్ట్ చేస్తుంది. స్టైలిష్ కీబోర్డ్ కావాలంటే విడిగా కొనుగోలు చేసుకోవచ్చు. 7700 ఎంఏహెచ్ బ్యాటరీని 20 వాట్ చార్జర్ తో చార్జ్ చేసుకోవచ్చు. ఇందులో నాన్ స్టాప్ గా 12 గంటల పాటు వీడియోలు వీక్షించొచ్చని కంపెనీ అంటోంది.