కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ స్వల్పంగా కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం ఒక కంపార్టుమెంటులో భక్తులు ఎదురుచూస్తున్నారు. శ్రీనివాసుని సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. శుక్రవారం నాడు స్వామివారిని 59,090 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,054 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్న స్వామివారి హుండీకి రూ.3.37 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ తెలిపింది.