గత నెల రోజుల వ్యవధిలో ఆర్చీస్, హ్యామ్ లీస్, డబ్ల్యూహెచ్ స్మిత్ వంటి రిటైల్ స్టోర్స్ నుంచి 18,600 ఆట బొమ్మలను అధికారులు సీజ్ చేశారు. భారతీయ నాణ్యతా ప్రమాణాలకు సంబంధించిన బీఐఎస్ మార్కులు లేకపోవడం, నకిలీ లైసెన్సులతో తయారు చేయడం వంటి అంశాలే దీనికి కారణం. ఎయిర్ పోర్టులు, మాల్స్ లో సోదాలు చేసి బొమ్మలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.