ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14,253 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. దీనికోసం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రిలీజ్ చేసి, ఏప్రిల్ లో రాత పరీక్షలు నిర్వహించనున్నారు. పశుసంవర్థక శాఖలో 4,764 పోస్టులు, హార్టికల్చర్ అసిస్టెంట్ 1005, విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్ 990, ఇంజినీరింగ్ అసిస్టెంట్ 982, డిజిటల్ అసిస్టెంట్ 736 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.