లంపీ స్కిన్ వ్యాధి పట్ల పాడి రైతులందరూ అప్రమత్తంగా వుండాలని పశువైద్యాధికారి డాక్టర్ ప్రణీత్ సూచించారు. శుక్రవారం బిక్కవోలు పశువుల ఆసుపత్రిలో జరిగిన అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడుతూ..... ఈ చర్మ వ్యాధి ఆవు, దూడలకు ఈగలు, దోమలు, పేలు వంటి కీటకాలు కుట్టడం ద్వారా వ్యాపిస్తుందన్నారు. వ్యాధి సోకిన పశువు మరో పశువుతో సన్నిహితంగా ఉన్నప్పుడు, కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఈవ్యాధి సోకుతుందన్నారు. ఇప్పటికే మండలంలో తెల్ల జాతి పశువులకు వాక్సిన్ వేశామన్నారు. ఇంకనూ పశువుల్లో జ్వరం, అవయవాలతో పాటు జననేంద్రియాల వాపు, కళ్లలో నీరు కారడం, లాలాజల స్రావాలు పెరగడం, చర్మంపై పొక్కులు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పశువైద్యులను సంప్రదించాలని తెలిపారు. వ్యాధి ముదిరితే పశువులు చనిపోయే ప్రమాదముందని వైద్యాధికారి అన్నారు.