నాగపూర్ లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గడ్కరీ కార్యాలయానికి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. నేడు కొద్ది వ్యవధిలో మూడు బెదిరింపు కాల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తొలుత 11.25 గంటలకు ఫోన్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు, ఆ తర్వాత 11.32 గంటకు, 12.32 గంటలకు ఫోన్ చేసినట్టు గుర్తించారు.
హుటాహుటీన గడ్కరీ కార్యాలయానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. బెదిరింపు కాల్స్ పై విచారణ చేపట్టారు. కాల్ రికార్డులను సేకరించారు. నాగపూర్ లోని గడ్కరీ కార్యాలయం వద్ద బందోబస్తు పెంచారు. ఈ కాల్స్ బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ నుంచి వచ్చినట్టు నాగపూర్ డీసీపీ రాహుల్ మదానే వెల్లడించారు. గడ్కరీ కార్యాలయం వద్దే కాక, ఆయన పాల్గొనే కార్యక్రమాల వద్ద కూడా భద్రత పెంచుతున్నట్టు వివరించారు.