కందుకూరు పట్టణంలో సోమవారం అనుమానాస్పద స్థితిలో ఒక యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఆదిఆంధ్ర కాలనీ ఓఇంటిలో అదే ప్రాంతానికి చెందిన చదలవాడ ఇజ్రాయిల్ (35) మెడకు ఉరి వేసుకొని వేలాడుతుండడాన్ని స్థానికులు గుర్తించి బంధువులకి సమాచారం అందజేశారు. మెడకు ఉరితాడు ఉన్నప్పటికి ఇజ్రాయిల్ వేలాడుతున్న స్థితిలో అది ఆత్మహత్య కాదని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రించేందుకు చేసిన ప్రయత్నమని మృతుడు అన్న కిషోర్ ఆరోపిస్తున్నారు. అక్రమ సంబంధం పెట్టుకున్న ఇజ్రాయిల్ భార్య అందుకు భర్త అడ్డుగా ఉన్నాడని పథకం ప్రకారం ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని ఆరోపించారు.