చాలా మంది సిలిండర్ డెలివరీ చేసే వారికి రూ.20 నుంచి రూ.40 వరకు డబ్బులు ఇస్తుంటారు. అయితే సిలిండర్ డెలివరీకి అదనంగా డబ్బులు ఇవ్వాలనే రూల్ లేదని సమాచార హక్కు చట్టం ద్వారా తెలుస్తోంది. ట్రేడింగ్ ఏరియాలో సిలిండర్లను ఉచితంగా డెలివరీ చేయాల్సిన బాధ్యత ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్ లదేనని, రిటైల్ సెల్లింగ్ ప్రైస్ లోనే డెలివరీ ఛార్జెస్ కలిపి ఉంటాయని హెచ్ పీసీఎల్, ఐఓసీ స్పష్టం చేశాయి.