గిరిజనులకు అధికారులు వక్రీకరిస్తే సహించేది లేదని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ మంగళవారం అన్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు గ్రామస్తులతో ఎస్టి కమిషన్ సభ్యులు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అట్టడుగున ఉన్న గిరిజనులకు వారి సంక్షేమ అభివృద్ధికి ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ భరోసా ఇచ్చారు.