అంగన్వాడీ ల సమస్యలు పరిష్కారం చేయాలని అంగ న్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం ఐసీడీఎస్ పిడి కార్యాల యంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సీఐటీ యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శలు కె. ఝాన్సీ, పి. రేఖ ఏలిజిబెత్ లు మాట్లాడుతూ జిల్లాలో అంగన్వాడీ వర్కర్లుపై అదనపు భారం పడుతుంది, పని ఒత్తిడి పెరుగుతుందన్నారు. ప్రతి శుక్రవారం ప్రతి మండలం పరిధిలో అంగన్వాడీ వర్కర్ మధ్యాహ్నం సమయంలో పి హెచ్ సి లో మీటింగ్ కి రావాలని క్రింది స్థాయిలో మెడికల్ ఆఫీసర్స్, ఐసీడీస్ అధికారులు ఆదేశాలు చేస్తున్నారన్నారు.
రాష్ట్రంలో ఏ జిల్లాలో లేకపోయినా ఈ జిల్లాలో ప్రతి శుక్రవారం సమావేశాలు నిర్వహించటం వల్ల నెలలో 4 రోజులు సెంటర్ నుంచి మండలం కేంద్రం పి హెచ్ సి కి వెళ్ళటానికి ఒక్కో వర్కరకి రవాణా చార్జీలు 500 రూపాయలు భారం పడుతుందన్నారు. పని ఒత్తిడి పెరుగుతుంది. జిల్లా అధికారులుకి ఈ సమస్య పట్టడం లేదు, జిల్లా కలెక్టర్ ఆర్థర్ అని బయపెడుతు న్నారు, దీనితో రవాణా ఇబ్బందులు, ఒత్తిడి జిల్లాలో అంగన్వాడీలు ఎదుర్కొంటున్నారు.
ఇప్పటికే 5సం రాలు నుంచి టిఏ ట్రావలింగ్ అలెవెన్స్ బకాయిలు ఉన్నాయి, కావున పి హెచ్ సి లో శుక్రవారం అంగన్వాడీలకు మీటింగ్లు రద్దు చేయాలని కోరారు. ఒక వేళ హెల్త్ మీటింగ్స్ అవసరం అనుకుంటే గ్రామ స్థాయిలో నిర్వహించాలని అన్నారు. వినతిపత్రం ఇచ్చి నా తర్వాత సీఐటీయూ కార్యాలయంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది.
సమావేశంలో జిల్లా కార్యదర్శి పి. రేఖ ఏలిజిబెత్ మాట్లాడుతూ రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లుకి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, కనీసవేతనం 26వేలు ఇవ్వాలని, గ్రాట్యుటీ సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని, అంగన్వాడీ లకి ఇచ్చినా ఫోన్స్ సరిగ్గా పనిచేయక ఇప్పటికే అనేక యాప్స్ తో ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు ప్రభుత్వం పేస్ హాజరు అంటు నిబంధనలు తెస్తుంది.
అంగన్వాడీ లకు ఫేస్ హాజరు రద్దు చేయాలని, జీతాలు నెల సక్రమంగా రాక అప్పులు పాలుఅవుతున్నారని, ప్రతి నెలా 5 తేదీ లోపు జీతాలు ఇవ్వాలని, సమస్యలు పరిష్కరించాలని జనవరి 24, 25 ప్రాజెక్ట్ ఆఫీసులవద్ద ధర్నాలు, ఫిబ్రవరి 6నా పీడీ ఆఫీస్ వద్ద జిల్లా లోని అన్ని ప్రాజెక్ట్స్ వర్కర్లు, హెల్పర్స్ కలసి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర మంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్ యూనియన్ బాపట్ల జిల్లా కమిటి సభ్యులు శైల శ్రీ, అనిత, బసవ మ్మా, కామేశ్వరి, మమత, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సిహెచ్. మణిలాల్, సీఐటీయూ నాయకులు జె. శ్యామ యేలు తదితరులు పాల్గొన్నారు