ఆప్ఘాన్ ను తమ చేతుల్లోకి తీసుకున్న తాలిబన్లు కఠిన చట్టాలు అమలు చేస్తున్నారు. దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని సక్రమంగా విచారించకుండానే బహిరంగంగా వారి చేతులను నరికేశారు. కాందహార్ లోని అహ్మద్ షాహీ స్టేడియంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఈ సందర్భంగా ఇతర నేరారోపణలు ఎదుర్కొంటున్న మరో ఐదుగురికి కొరడా దెబ్బలు శిక్షగా విధించారు.