శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం మడకశిర పట్టణంలో ఘనంగా ఎన్టీఆర్ 27వ వర్ధంతి సందర్భంగా బుధవారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, నటసార్వభౌములు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేసి తెలుగువారి కీర్తిని దశ దిశలా వ్యాపించే విధంగా కృషి చేయాలని వారు తెలిపారు.
అనంతరం గుండుమల తిప్పేస్వామి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, సత్యసాయి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు భక్తర్, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మనోహర్ , మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ , క్లస్టర్ ఇంచార్జ్ ల నాగరాజు నరేష్ కన్నా కళ్ళుమరి నాగరాజు కౌన్సిలర్లు శ్రీనివాసులు హనుమంతు శ్రీనప్ప ఓబన్న కృష్ణ నాయ క్ అక్కంపల్లి బాబన్న తిమ్మరాజు మాజీ వైస్ ఎంపీపీ గోపాలప్ప మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రఘురాం సర్పంచ్ రామాంజనేయులు రవీంద్రారెడ్డి సోమశేఖర్ రెడ్డి హనుమంత రెడ్డి బేగార్లపల్లిరవికుమార్ అక్కిరెడ్డి మార్కెట్ బాబు ఈశ్వర్ రమేష్ రవి మంజు నాగరాజు సోము రవి అసీదుల్లా మల్లికార్జున నరసింహారెడ్డి కిష్టప్ప వడ్రపాలెం రాజు గోవిందప్ప చిన్నప్ప, తిమ్మయ్య, నగేష్, బీరప్ప, మూర్తి, జాజప్ప, వెంకట్, రాజు, వెంకటేష్, మండల పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.