ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కీవ్ లోని బ్రోవరీ సమీపంలో హెలికాఫ్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో కలిపి మొత్తం 17 మంది మృతిచెందారు. మృతుల్లో అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి డెనిస్ మొనాస్టైర్స్కీ, అతని డిప్యూటీ యూజీన్ యెనిన్ మరియు రాష్ట్ర కార్యదర్శి యూరి లుబ్కోవిచ్ సైతం ఉన్నారు. ఈ ప్రమాదంలో భారీగా మంటలు చెలరేగడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.