పరీక్షల్లో విద్యార్థులు ఒత్తిడి జయించేలా ప్రధాని మోదీ ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం ఈ సారి ఢిల్లీ తల్కటరా స్టేడియంలో జరగనుంది. ఈ నెల 27న ప్రధాని మోదీ విద్యార్థులతో ముచ్చటించనున్నారు. 2 వేల మందికి పైగా విద్యార్థులను ఎంపిక చేసి సర్టిఫికెట్ సహా ఎగ్జామ్ వారియర్స్ పుస్తకాన్ని అందిస్తారు. తమ సందేహాలు అడగాలనుకుంటే క్వాలిటీ వీడియోను pibhyderabad@gmail.com కు పంపించాల్సి ఉంటుంది.