అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణం, జిల్లా ఎస్పీ డాక్టర్ పకీరప్ప ఐపిఎస్, గుంతకల్ డిఎస్పి యు నర్సింగప్ప ఆదేశాల మేరకు సీఐ కె.రామసుబ్బయ్య ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర బైకుల దొంగ అరెస్ట్. హనుమాన్ సర్కిల్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా గుంతకల్ నుంచి బళ్లారి వైపు వెళ్తున్న గౌని నరేందర్ రెడ్డి అను ముద్దాయిని ఎస్సైలు అంజనప్ప, తిరుపాల్, హెడ్ కానిస్టేబుల్ వెంకటేష్, కానిస్టేబుల్ వీరాంజనేయులు, దూద్ పీరా అదుపులోకి తీసుకొని విచారించగా అంతర్రాష్ట్ర బైక్ దొంగగా నిర్ధారించారు. అతని వద్ద ఉన్న 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని రిమాండ్ నిమిత్తం కోర్టు హాజరు పరిచినట్లు సీఐ కె రామసుబ్బయ్య, సి గణేష్ తెలిపారు. సిబ్బంది వెంకటేష్, వీరాంజనేయులు, దూద్ పిరా లను ఉన్నతాధికారుల అభినందించారు.