నందమూరి తారక రామారావు 27వ వర్ధంతిని ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తెదేపా శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ సర్కిల్లో గల నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ అమరహే ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తాం అని కార్యకర్తలను నినదించారు. అనంతరం కొత్తపేటలో గల ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల లతో ఘనంగా నివాళులు అర్పించారు. అక్కడి నుండి పల్లవి థియేటర్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా పూలమాలలతో తెదేపాశ్రేణులు నివాళులర్పించారు తదనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో గల పేషెంట్లకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలో గల ప్రభుత్వఆసుపత్రి పక్కన గల పాత అన్న క్యాంటీన్ వద్ద అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు ఉచిత భోజనం అందించారు ఈ సందర్భంగా పేదలు పెద్ద ఎత్తున అన్న క్యాంటీన్ వద్దకు వచ్చి ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని 35 సంవత్సరాలుగా పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్ళతో పెకలించి చరిత్ర సృష్టించిన మహనీయు డు ఎన్టీరామారావు అని కొనియాడారు. దేశ చరిత్రలోనే మొట్టమొదటిగా మన రాష్ట్రంలో కూడు, గూడు, గుడ్డ ఇవ్వాలని రెండు రూపాయల కిలో బియ్యం బలహీన వర్గాల వారికి పక్కా గృహాలు, ఆప్కో ద్వారా పేదలకు చీరలు ధోవతిలు అందించి పేదల గుండెల్లో గూడు కట్టుకున్న మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రాముడు అని ప్రశంసించారు. దేశంలోనే మొట్టమొదటిగా వృద్ధులకు వితంతువులకు పెన్షన్ పథకం తీసుకొచ్చి సంక్షేమ పథకాల అద్యుడు నందమూరి తారక రామారావు అని బలహీనవర్గాల పేదలకు పక్కా ఇల్లు ఉండాలని ఒక మంచి సంకల్పంతో భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో ఉన్న పేదలకు పక్కా ఇల్లు నిర్మించిన మహనీయుడని తెదేపాశ్రేణులు కొనియాడారు. నందమూరి తారక రామారావు అడుగుజాడల్లోనే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న దృఢ సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుగారు కంకణం కట్టుకున్నారని తెదేపా శ్రేణులు అన్నారు.